![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -434 లో.. రుద్రాణి మాయని భయపెట్టి ఇంట్లో నుండి పంపించిన విషయం గుర్తుకుచేసుకుంటుంది. ఆ మాయ అందరిని ఇంత మోసం చేసింది. దాన్ని వదిలిపెట్టకూడదని ధాన్యలక్ష్మి అనగానే.. ఆ మాయ నిజం స్వరూపం తెలిసింది దాన్ని చంపేస్తామని భయపడి వెళ్ళిపోయి ఉంటుందని రుద్రాణి అంటుంది. ఆ మాయని తన వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారో మొత్తం కనుక్కోవాలని కావ్య అంటుంది.
మన ముందే ఉన్నారేమో మంచిగా నటిస్తూ అని రుద్రాణి వంక కావ్య చూస్తూ అనగానే.. అవును ఇన్ని రోజులు మన ముందు మంచివాడిలా తిరిగిన అన్నయ్య చూడు ఏం చేసాడో అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఇందిరాదేవి సుభాష్ దగ్గరికి వెళ్లి.. చెంప చెల్లుమనిపిస్తుంది. దేవతలాంటి భార్యని మోసం చేస్తావా అని సుభాష్ ని ఇందిరాదేవి తిడుతుంది. ఆవేశపడకండి అని ఇందిరాదేవిని కావ్య, ధాన్యలక్ష్మి ఇద్దరు ఆపుతారు. తండ్రి తప్పు చేస్తాడట.. కొడుకు దాన్ని దాస్తాడట.. మీరేమైన గొప్ప పని చేసారా అని ఇందిరాదేవి అంటుంది. నా కోడలు క్షేమంగా ఇంటికి రాకపోతే నువ్వు ఆ ఇంట్లో శాశ్వతంగా అడుగుపెట్టావని ఇందిరాదేవి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత డాక్టర్ వచ్చి అపర్ణ క్రిటికల్ కండిషన్ లో ఉందని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత రాజ్ అందరిని ఇంటికి పంపిస్తాడు. హాస్పిటల్ లో రాజ్ , కావ్య, సుభాష్ మాత్రమే ఉంటారు.ఆ తర్వాత ఇదంతా నీ వాళ్లే ఎక్కడికెక్కడికో తిరుగుతూ అది చేస్తాను.. ఇది చేస్తానంటూ చివరికి మా అమ్మకి ఇలా అవడానికి కారణం అయ్యావ్. మా అమ్మకి ఏమైనా అయితే ఈ జన్మలో నీ మొహం చూడనని కావ్యతో రాజ్ అంటాడు.
మరొకవైపు ఛీ మీ పెద్ద నాన్న తప్పు చేశాడా.. అదేం బుద్ది ఇన్ని రోజులు రెస్పెక్ట్ ఉండేది అంటూ సుభాష్ ని అనామిక తిడుతుంటుంది. అది కళ్యాణ్ చూడలేక.. అసలు నువ్వు ఇన్ని రోజులు నన్ను నమ్మించడం కోసం మంచి దానిలాగా నటించావా అని అనామికని తిడతాడు. మరొకవైపు సుభాష్ బాధలో కత్తి తీసుకొని చెయ్యిని కట్ చేసుకుంటాడు. దాంతో రాజ్, కావ్య వచ్చి ఆపుతారు. వెంటనే సుభాష్ కి కట్టు కడతారు. రాహుల్ , రుద్రాణి లు అపర్ణకి ఈ సిచువేషన్ స్ట్రెస్ కి గురి చేస్తే తన చనిపోతుందని అనుకుంటారు. ఆ తర్వాత కావ్య అపర్ణ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే.. నువ్వు నాకు దైర్యం చెప్తున్నావా అని అడుగుతుంది. నేను తప్ప ఎవరు మీకు ధైర్యం చెప్పలేరని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |